పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన మనం 1983 ఎస్ ఎస్ సి విద్యార్థుల సేవలకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హ్యాట్సాఫ్ చెప్పారు. రాయచోటి ప్రభుత్వాసుపత్రి సమీపంలో 1983 ఎస్ ఎస్ సి పూర్వపు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకును ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పట్టణం, గ్రామీణ ప్రాంతాల లో నుంచి వచ్చే పేద ప్రజల ఆకలి బాధలను గుర్తించి వారికి అండగా నిలిచే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు .పట్టణంలోని శుభ కార్య క్రమాలసమయాలలోనూ , గృహాల యందు అవసరానికి మించి తయారు చేసిన భోజనాలును భద్రంగా భద్ర పరచి ఆకలిగన్న వారికి అందచేసే కార్యక్రమం చేపట్టడం మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పండ్లు, పాలును, బట్టలను కూడా ఇక్కడ అందిస్తే పేదలకు పంపిణీ చేస్తారన్నారు. ఆసుపత్రులకు వచ్చే బాలింతల సౌకర్యార్థం వేడినీటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ కల్పించారన్నారు. ప్రజల సౌకర్యార్థం మినరల్ వాటర్ ను కూడా అందివ్వనున్నారన్నారు.
ఇలాంటి గొప్ప కార్య క్రమాలకు స్థానిక పెద్దల నుంచి కూడా సహాయ,సహకారాలు లభిస్తాయన్నారు.మొదటి రోజు భోజనాలును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా అందచేశారు.
దాతల సహకారంతో ఫుడ్ బ్యాంకు సేవలను విస్తృతం చేస్తామని మనం సంస్థ సభ్యులు తెలిపారు. ఫుడ్ బ్యాంకు ఏర్పాటుకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేయించడంతో పాటు ఆర్థిక సహకారం అందచేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు బయారెడ్డి, నారాయణరెడ్డి,మహేశ్వర రాజు,భాస్కర్ రెడ్డి, సునీల్ కుమార్ నాయక్,శ్రీనివాస కుమార్ రాజు, అర్బన్ సి ఐ రాజు, ఎం ఈ ఓ రామకృష్ణ మూర్తి, మనం సేవా సంస్థ అధ్యక్షుడు ప్రకాష్, సభ్యులు అశోక్, గోవింద్ రెడ్డి, శ్రీధర్ బాబు,శంకర్, శివ ప్రసాద్,ఆర్షద్,భాస్కర్, హారూన్, ఎస్ టి యు రవీంద్రా రెడ్డి, రెడ్డేన్న, శ్రీధర్ రాజు , వై ఎస్ ఆర్ సి పి నాయకులు దశరథ రామిరెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, హాబీబుల్లా ఖాన్, ఫయాజు60ప్ర్ రెహమాన్, ఫయాజ్ అహమ్మద్, జిన్నా షరీఫ్ ,రియాజ్, రియాజుర్ రెహమాన్ , ఆర్ట్స్ శంకర్, అంజాద్ , సలీం తదితరులు పాల్గొన్నారు.
MLA Srikanth Reddy garu, Dr.KBayareddy garu, Dr.NarayanaReddy garu& V.Reddy Husen garu masapet ద్వారా ‘మనం’ food bank కు 19000/- ఈ రోజు డొనేషన్ రావడం జరిగింది.
0 Comments